14ఏళ్ల పిల్లాడు సెంచరీ బాదేశాడు. గుజరాత్ స్టార్ బౌలర్స్ ను దుమ్ము రేపాడు..దుల్లగొట్టాడు..మరో సచిన్ వచ్చాడు..సెహ్వాగ్ వచ్చాడు అంటాడు..ఒక్కరోజులో అల్ల కల్లోలం చేసిపారేశారు ఇంటర్నెట్ ని అందరూ. రీజన్ 14ఏళ్ల రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. అసలు అంత చిన్న వయస్సులో భయం అనేదే లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు..బాదిన 11 సిక్సర్లు...35 బాల్స్ లోనే సెంచరీ లాంటి తన పేరు ను ప్రపంచవ్యాప్తంగా వినపడేలా చేశాయి. పాపం అవన్నీ విని బెదిరిపోయాడేమో నిన్న ముంబై పై మ్యాచ్ లో డకౌట్ అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ. ముంబై విసిరిన 218 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసేందుకు యశస్వి జైశ్వాల్ తో కలిసి బరిలోకి దిగిన సూర్యవంశీ దీపక్ చాహర్ బౌలింగ్ లో విల్ జాక్స్ క్యాచ్ పట్టడంతో సున్నా పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కావాలని కొట్టుకున్నా క్యాచ్ అవుట్ అవ్వటంతో డల్ ఫేస్ పెట్టుకుని డగౌట్ కు వెళ్లాడు సూర్యవంశీ పాపం. జాలేసింది చూస్తే. అంత చిన్న ఏజ్ లో మనం విపరీతమైన ప్రెజర్ పెడుతున్నామా సూర్యవంశీ మీద అని ఫ్యాన్స్ అంతా భావించేలా..నిన్న RR ద్రవిడ్ కూడా సున్నితంగా వారించాడు అభిమానులను. తనను ప్రెస్ మీట్ లో 19 ప్రశ్నలు అడిగితే అందులో 17 ప్రశ్నలు వైభవ్ గురించే అడిగారని..ఇంత చిన్న వయస్సులో తనపై అంత అటెన్షన్ ఉండటం...ప్రెజర్ పెంచటం అవుతుందని తనను స్వేచ్ఛగా వదిలేయాలని టెక్నిక్ సంగతి తను చూసుకుంటానని హామీ ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్. మరి ఫ్యాన్స్ ద్రవిడ్ చెప్పినట్లు ఆగుతారో...లేదా సెంచరీ కొట్టి నెక్ట్స్ మ్యాచ్ కే డకౌట్ అయ్యాడని ఆ చిన్న పిల్లాడిని కూడా టార్గెట్ చేసి మాట్లాడతారో చూడాలి.